శీర్షిక *చరవాణి ఆక్రమణ
రచన-: విజయ గోలి
చరవాణి ఆవిష్కారం ..
బాలకృష్ణుడి నోరు పోలిన విశ్వదర్శనంగా చమత్కారం..
కరభూషణమై అలరారే ఆకాశవాణి. .
క్షణాలలో విశ్వ వ్యాప్తమే దృశ్యవా ణి ..
ఆట పాటల మైదానమే
వాట్సాప్ లో ఛాటింగులు స్టేటస్ లో ఫీలింగులు
స్టేటస్ కు సింబల్ గా స్మార్ట్ ఫోను బిల్డప్పులు
మాటలేక మునులల్లే మౌనగీతమే ఎల్లప్పుడు
మేధావిని మేరువుగా మలుచు మలుపులెన్నెన్నో..
భూతలాన స్వర్గంగా అరచేతిన సెల్ ఫోన్.
అర్ధరాత్రి శుభరాత్రి వెనువెంటనే శుభోదయం
నిదురలేని రాత్రుల నిండిపోవు విరహగీతం
మెసేజులతొ మెరుపులు .విరిగిన ప్రేమల అతుకులు
వింత వింత పోకడలతో మునుగుతున్న యువత బతుకు
దూరమైన బంధాలకి దారి కలుపుచు ఒకమారు…
పడకటింట కయ్యాలకు సూత్రధారి తానయ్యెను
నెలలు నిండని బుడత గాడికి అమ్మపాడని జోలపాట
వయసు పండిన తాతగారికి మనసు నింపె పాత పాట
ఇందు కలదు అందు లేదను సందేహమె లేదు
ఎందరెందరిని వెతికి చూచిన చరవాణీ ఆక్రమణే…!
పెరుగుతున్న విజ్ఞానం …పెడత్రోవలొ తరుగుతుంది
విలువ తెలిసి నడుచుకుంటె విషయమెంతో ఆనందం .