శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్ . విజయ గోలి
చందన పరిమళ సుందర దేహం
అల్లరి చూపుల ఆమని రాగం
చల్లని వెన్నెల జల్లుల హాసం
మాయా మోహన మంజుల గానం
చెక్కిన విల్లుగ చక్కని కనుబొమ
కన్నుల వాకిట కాటుక తోరం
కెంపై మెరిసిన నుదుటిన తిలకం
మధువుల గనులే అధరపు తీరం
తాపము రేపే తన్మయ లాస్యం
కన్నుల వెలిగే చిన్మయ రూపం
విజయం చేయగ వేడిన చేరవు
వేచిన వేళల మల్లెల హారం
నీవే నేనను ఊహే ప్రాణం
నీ పద సేవే తీరని దాహం