గజల్. విజయగోలి
రాచలీల బృందావన జతగాడే గోవిందుడు
వేణుఊది వ్రేపల్లియ హితగాడే గోవిందుడు
గోకులమే కదిలివచ్చు గోపాలుని గానముతో
ఆలమంద లదిలించే పిలగాడే గోవిందుడు
వెన్నపాలు దొంగిలించి విన్నపాల వేడుకలో
మాయచేసి మాటుదాగు మాయగాడె గోవిందుడు
జలకమాడ గోపెమ్మలు చెట్టుమీద చీరలెట్టె
వేడపోగ మేలమాడు చోరగాడె గోవిందుడు
ప్రతిపనిలొ పరమపదపు పరిధిచూపు పరమాత్మ
“విజయ” కెపుడు తోడునీడ చెలికాడే గోవిందుడు