గోరింట విజయ గోలి
ఆషాఢ మాసాన అరచేతి గోరింట..
అత్తింటి పంట …ఆరుద్ర రంగంట …
పుష్య మాసములోన పడతి చేతి గోరింట..
పుట్టింటి ప్రేమంట..పగడపు చాయంట..
ముదురు ఎరుపు పంట..ముదిత వరమంట…
మగని ప్రేమకు మరుల కొలతంట…
మణికట్టు పై చుక్క.. గోరింట..
అన్నతమ్ముల పేరిట అమ్మణ్ణి ..ప్రేమంట..
అరికాలి గోరింట ఆరోగ్య రక్షంట…
ఏడు జన్మల సొత్తంట…గోరింట…ఏ అతివకైనా ..విజయ గోలి