శుభోదయం🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
గువ్వలెగిరి పోయాకా గూడుమిగిలి పోవునులే
చల్లగాలి తరుముకొస్తె మబ్బుకదిలి పోవునులే
కలకాలం శిశిరాలే కమ్ముకోని మురియవులే
వసంతమే గుండెతడితె వెతలువదిలి పోవునులే
కొత్తనీరు వరవడితో పాతనీరు మరుగుపడును
మరపొక్కటి మందుగానె మనసునడిచి పోవునులే
వయసెప్పుడు అడ్డురాదు మనసెప్పుడు అదుపైతే
ఆలోచన అందమైతే అహమువీగి పోవునులే
అభిలాషలు ఆవిరైతే ఆయువుకు “విజయ”మేది
తలవకున్న తరులదారి విరులువీడి పోవునుల