గజల్. విజయ గోలి
గువ్వలెగిరి పోయాక గూడు నలిగి పోవునులే
చల్లగాలి తరుముకొస్తె మబ్బుకదిలి పోవునులే
కలకాలం శిశిరమే కమ్ముకోని మురియదులె.
వసంతమే గుండెతడితె వెతలువదిలి పోవునులే
కొత్తనీరు వరవడితో పాతనీరు మరుగుపడును
మరపొక్కటి మందుగానె మనసునిలిచి పోవునులే
వయసెప్పుడు అడ్డురాదు మనసెపుడు అదుపైతే
ఆలోచన అందమైతే అహముతరలి పోవునులే
అభిలాషలు ఆవిరైతే ఆయువుకు “విజయ”మేది
తలవకున్న తరులదారి విరులురాలి పోవునులే