శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం FBలో చాలా వైరల్
అయింది చాలామంది ఈ చిత్రంపై చాలా చాలా రకాల ప్రక్రియలు ప్రయోగించారు .
నేను కూడా నాదైన శైలి లో గజల్ వ్రాయటం జరిగింది
ఈ రోజు హఠాత్తుగా FB గుర్తు చేసింది.
మళ్ళీ సరదాగా.పోస్ట్ చేసాను .
గుండెసడిలొ నీపేరే గుడిగంటగ మ్రోగుతుంది
వెనుతిరిగి చూడమంటు చూపొక్కటి తాకుతుంది
ఏనాటిదొ ఈపరిమళం తడుముతోంది మదిని ఇలా
ఇక్కడనే నను చుట్టిన జ్ఞాపకమై మెదులుతుంది
చూపులలో చూపుకలిపి చూసినదీ ఒక క్షణమే
మలిగి పోక ఈనాటికి మలిచూపుకై వెదుకుతుంది
నీవెవరో నేనెవరో నిజమేమిటొ తెలియకుంది
కాలమంత కదిలి కదిలి కలలోనే ఆగుతుంది
ఆశలెపుడు ఆకశాన తళుకులీను తారకలే
అమావస్య చంద్రుడికై అణువణువు వెతుకుతుంది!!