శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
గుండెలోని గుట్టేదో గుచ్చి గుచ్చి అడుగుతుంది
వెలికి చెప్పి వేడుకేదొ పంచమంటు వేడుతుంది
అవునన్నా ..కాదనినా …ఆమనిలో కోయిలలా
పదే పదే పల్లవిగా పాడమంటు పలుకుతుంది
తొలిచూపుల తన్మయమే తొలకరిగా తుళ్ళుతుంది
సిగ్గులతో గులాబీల మధు వనమే విచ్చుతుంది
కనులు కలిపి ఊసులాడ ఊహలలో ఊగుతుంది
అపురూపం ఆతలపే మబ్బులలో తేలుతుంది
ప్రేమంటే ఇదేనంటె… కలకాలం కోరుతుంది
విశ్వాన్నే గెలుచుకున్న విజయంగా చాటుతుంది