గుండెలో ముల్లుగా గుచ్చినా రాలేదు నీపైన ద్వేషం
వ్యధగానె మదిలోన దాగినా పోలేదు నీ మీద (నీపైన) మోహం
పలు రంగు పరదాలు నింగిలో నెగిరాయి హరివిల్లు చందం
ప్రతివన్నె స్వర్ణమను భ్రాంతిలో ముంచింది నీవలపు వేషం
రాతలో లేనిదే గీతమై పాడగా విధాత కలమేల
రవళించు మురళియై దాగింది హృదిలో నీతలపు శేషం
ఉదయాస్తమయాలు ఊహలేగ కదలనీ సూరీడు కధలో
గ్రహ గతులు గంతులే వేసినా రాలేదు నీ వరకు దోషం
అవనిపై జల్లుగా ఆశలే కురిసినా అందని ద్రాక్షగా
ఆవిరిగ మబ్బుల్లో జేరినా మారదుగా నా మనసు క్లేశం