శ్రీ మల్లినాధ సూరి కళాపీఠము ఏడుపాయల
శ్రీ అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యం
సప్తవర్ణాల సింగిడి 19/10/2020
అంశం-: శ్రీ గాయత్రీ మాత
నిర్వహణ-: శ్రీమతి గీతాశ్రీ స్వర్గం గారు
రచన-: విజయ గోలి
ప్రక్రియ -: వచన కవిత
శ్రీ గాయత్రీమాతా.
వేదవేదాంత స్వరూపిణి
వేదమాత విశ్వ రూపిణి
శ్రీచక్ర నివాసిని…శ్రీమాతా
సర్వ మంత్రాధిష్ట దేవతా
కొలుతుమమ్మా నిను కోర్కెదీర
గాయత్రీ మంత్ర వాసిని
సర్వదేవతా సంపూర్ణ రూపిణి
హంసవాహిని శక్తి స్వరూపిణి
పంచముఖ పరమేశ్వరి
శంఖు చక్ర గధాయుధ ధారిణి
గాయత్రీ మంత్ర పఠనమే
శ్వాసగా ధ్యానింతుమమ్మా
సర్వపాపహరమే..నీస్మరణము
సర్వార్ధ సాధనమే…నీసేవలు
అమ్మ అని నిను జేర
ఆదరమ్మున హత్తుకొందువు
కరుణచూపే కల్పవల్లివి
మా తప్పులన్నియు బాపి
ఒప్పుగా మము చూడుమమ్మ
సర్వ మంగళ నీవుగా
సర్వ శుభముల నిమ్ము తల్లీ
నిండుమనసుతో నీసేవ చేసే
భాగ్యమిచ్చి భాగ్యవంతుల చేయుమమ్మ
ఆనందవల్లిగ మా ఇంట నిలచి
కొంగు బంగారమై కొలువుండుమమ్మ