కనుపించని సంకెళ్ళు

విజయ గోలి.   గజల్
కనిపించని సంకెళ్ళతొ నడకలింక ఎన్నాళ్ళు
గుండెలపై నెగళ్ళతో కాలుటింక ఎన్నాళ్ళు

అడుగడుగున ఆంక్షలతొ ఆదరింపు ఏమిటనీ
అబల అనే అలతిముసుగు కప్పుటింక ఎన్నాళ్ళు

అవనిమీద నిలిచివున్న అంబరాన మెరిసిననూ
అమ్మాయిగ అణుకువంటు గీతలింక ఎన్నాళ్ళు

ప్రేగుతీపి బలహీనత బంధానికి బలిపశువుగ
గాంధారీ గంతలతో బ్రతుకులింక ఎన్నాళ్ళు

ఉప్పెనగా ఉరికినపుడె సమరంలో విజయములే
అమ్మతనం గుర్తించని అల్పమింక ఎన్నాళ్ళు

 

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language