సహమిత్రులకు నమస్కారం🙏🏻
చగురుతుల్యులు గా భావించి మీ అమూల్యమైన సలహాలతో సహకరించవలసినదిగా కోరు తున్నాను🙏🏻🙏🏻
విజయ గోలి. గజల్ 1. 10 /6 /2020
కనులకొలను తరగలపై నిలచిన నాకల నీవు
కడలిఅలల ఊయలపై ఊగిననాకల నీవు
నీలిమబ్బు అంచులపై మెరుపుతీగ నీవు
మల్లెపూల పరిమళమై విరిసిన నాకల నీవు
వేకువ వెలుగులో భూపాలరాగమే నీవు
కోయిలమ్మ పిలుపులో పలికిన నాకల నీవు
పున్నమివెలుగులో విరిసిన జాబిల్లి నీవు
తారల తళుకులో మెరిసిన నా కల నీవు
ఆరని వెలుగువై కనురెప్పల దాగిన నాకల నీవు
నా ఆశల నిలయంలో నిజమైన విజయం నీవు
*