చెలిమితనం

గజల్🌹🌹🌹 విజయ గోలి🌹🌹🌹

చింతలలో చెంతచేరు  కలిమేగా చెలిమితనం
వెతలలోన వెంటనిలుచు  బలిమేగా  చెలిమితనం

బాల్యములో బంధమైన  గుప్పెడున్న గుండెసడిగ
స్నేహాలను మీటుతున్న స్వరమేగా చెలిమితనం

తలపులలో తలచినంత తలుపుతట్టు పిలుపేకదా
నవ్వులలో  నవ్వుకలిపి నడకేగా చెలిమితనం

తొలిప్రేమల  సందూకమె  సరదాలలొ దోస్తానా
తడబడితే  అందించే చెయ్యేగా చెలిమితనం

కోపాలతొ  తాపాలతొ  *విజయాలే విందులుగా
శాసించే ఆత్మీయత  ఘన హక్కేగ చెలిమితనం

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language