క్షితిజం

శీర్షిక -: క్షితిజం..

రచన-: విజయ గోలి

నీలాంబరము నీలిసంద్రము
సంగమించిన నీలమందున
నిలిచి ఆడిన వెండి వెలుగు
క్షణకాలపు నర్తనమే క్షితిజం

క్షణభంగురమౌ జీవిత స్పందనం
నిన్నటి అనుభవం నేటి ఆనందం
రేపటి ఆశల కదంబం నిత్య నూతనం
అలుపు తెలుసుకు అడుగు ముందుకు

ఉషోదయం ప్రతిరోజు ఉజ్వలమే
అస్తమయానికి అనుభవాల హారం
పరస్పరం బంధం లో కొత్త ప్రయాణం
కోమలమే కావాలని కోరికల సారం

ఉల్క రాలు సమయంలో ఉద్వేగపు కాంక్ష
మలినాలను మరక లేక తుడిచేసే..యత్నమే
నిర్ధిష్టపు గీతలపై నడకలెపుడు నిర్మలమే
ఆచరణలో ఆశయమే ఉన్నతమౌ నిర్దేశం

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language