గజల్. రచన-:విజయ గోలి
కోరినంత కాలమాగి పోనిదంట మనకోసం
జారినట్టి జాడెపుడు రానిదంట మనకోసం
పరిచయాలు పాఠాలే చదవుకుంటె బ్రతుకంత
గుడ్డిగవ్వ విలువలేమొ తెలుపునంట మనకోసం
ఎదుటివారి మాటలలో బెల్లమెంతొ తెలియాలిగ
ఎగడుదిగుడు బాటలేవొ చూపునంట మనకోసం
కలలెంతో కమ్మనంటు కాలమంత నిదురేల
కష్టపడక కాసులెపుడు రాలవంట మనకోసం
వేటలోన సింహానికి మెరుపేదో ఎరుకేలే
గురిలోపలి గుట్టుచెప్ప గురువేనట మనకోసం
గిరులెపుడూ నునుపేలే కనుచూపుకు దూరంలో
దరిజేరితె మలుపేమిటొ దాచదంట మనకోసం
మనసెపుడూ ఒంటరైతె మనుగడలో మస్తిలేదు
దోస్తీలో దొరవైతే “విజయ మంత మనకోసం