కొరడా విజయ గోలి
మితి మీరిన మానవుని ఆగడాలకు …
దేవుడు కొట్టిన కొరడా దెబ్బ …క్రమశిక్షణే లక్ష్యం …
అల్లరిచేసే పిల్లల్ని .. అదిలించినట్లు ..
చిట్టచివరకు విజయం కూడా దేవుడిదే …
తన రూపంలో ఎంతోమందిని సాయుధులుగా నిలిపాడు ..
దేవుడెపుడూ తనకు తానుగా రాడు..
తన అంశలైన వారిని బాసటగా నిలుపుతాడు ..
మానవత్వం ,మంచితనానికి ..మనుగడనిస్తాడు ..
వైద్యనారాయుణులు,పారిశుధ్య పరమ హంసలు
ఆర్ధిక దాతలు ,అన్న దాతలు …అందరికి వందనాలు ..
ఏది ఏమైనా ..ఈ విజయం అనంతరం ..
భారతీయ నాగరికత,సంస్కృతి ….
పునర్నవిగా పురుడు పోసుకుంటుంది …
విశ్వమంతా తానై విజయ పతాకం ఎగుర వేస్తుంది …
ఆశతో అనంతుణ్ణి ప్రార్థిద్దాం ..ఆపద గట్టెక్కించమని..
సర్వే జనాః సుఖినో భవంతు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻విజయ గోలి .