శీర్షిక**కైవల్యం** విజయ గోలి
శ్యామసుందరా…నా…మనోహరా..
నా శ్వాస లో నీ ఊసే నిలిచివున్నా..
నా కనుల నిండా నీ రూపమే..కొలువున్నా..
నా మనసెందుకో…అలజడి నింపుకుంది..
నా ఆర్తిని నీవు గుర్తించ లేదేమోనని కలవరం..
నీ వేణు రాగాలలో నా ఊసులే నిండివున్నాయని …
అలవోకగానైనా నీఅధరాలపై చిరునవ్వు నేనె అనలేవా..
అలౌకికమైన ..రాగ ద్వేషాల కొలిమిలో నే కాలిపోనా ,
నీ ప్రేమ సాగరంలో..బిందువునై
కలసి పోయినపుడు కదా నా ఈ జన్మకు సాఫల్యం..
ఎంతటి భాగ్యశాలిని .. మదనగోపాలా. …
ఎన్ని జన్మల తపముల ఫలితమో ఇది ..
నీ పరిష్వంగ లాలన లో..మోహన వేణు రాగాలలో..
పారిజాత సుమ మాలికల…..సమర్పణల సాంగత్యం లో
తనువూ మనసు…నిండిపోయిన పారవశ్యం లో..
మదిలోపలి మౌనాలను తడిమి..లేపుతున్న తన్మయత్వం
ఇంతకు మించిన ..కమనీయ…కైవల్యమేమున్నది కన్నయ్యా…