కుళ్ళిన జంతువు

కుళ్లిపోయిన  జంతువు..కంపును మించిపోయిన ..

ఇరుకు మనసులలోని మురికి ఆలోచనల కంపు ..

కామం తో మూసుకు పోయిన కంటి చూపులో

అమ్మ ఎవరోఆలి ఎవరో..చెల్లి ఎవరోకూతురెవరో ..

పసికందో….నెత్తురోడుతున్న ..పిండమో ..

గోవైనామేకైనానక్కైనాకుక్కైనా ..

ఆడదైతే  చాలు..మనిషి ముసుగేసుకున్న ..మృగానికి

.

దెసపోతుంది ఈదేశ ..ధర్మ సంస్కృతి ..

నరరూప రాక్షుసులను చీల్చి ,చెండాడే ..

నార సింహుడు  ఎప్పుడొస్తాడో….ఎక్కడున్నాడో ..విజయ గోలి

పుడమి తల్లి కన్నుల చెలమలెండి పోయాయి.

బీడు పడిన భూములపై కలుపు మొక్క  కరువాయె

గుండెనిండిన నిరాశల నిట్టూర్పులు..

గాలివాటు మబ్బులపై గంపెడాశలు..

గాడి తప్పుతున్న ఋతువుల గతులు

ఆదిత్యుని ఆదరాన్ని  తట్టుకోలేక ..

వరుణుడొచ్చే తరుణం కోసం…..

తడి ఆరని కన్నులతోతపించే బ్రతుకులు .  విజయ గోలి

విజయ గోలి ..గుంటూరు  శీర్షిక -:సీతాకోకచిలుక

గుబులు లేక గూడులో తొంగున్నపుడు అదే లోకమనుకున్నా

గూడువదిలి రెక్కలతో బయటికి వచ్చాకే తెలిసింది ..

ఇంద్రధనుస్సు రంగులతో ఇరుకైన లోకమొకటుందని .

మధువు నింపిన పూలగిన్నెల జాడకోసం వెతకలేనని ..

కాలుష్యపు కడలి నీడ సహజమైన అందాలను కాటేసి ..

కసి కసిగా రెక్కలు విరిచేసి అవిటిదాన్ని చేస్తుందని

ఒంటి చేత్తో ఒడిసి పట్టే వానచుక్క దాహం తీర్చదని..          విజయ గోలి

పిచ్చుక..పై ..బ్రహ్మాస్త్రాలు ..

కాలుష్యపు కడలిలో

కరిగిపోతున్న ప్రకృతి బంధుగణం ..

అంతరించి పోతున్న అందమైన జాతులు

చరవాణి సాంకేతిక స్తంభాలు ..

విహంగాల దారిలో ఉరి కంబాలు .

ప్రతి ఇంటి బంధువుగా

ప్రతి రైతు నేస్తంగా

పలుకరించే పిచ్చుకమ్మలు..

అమ్మ తెచ్చే గింజకోసం ..

ఆవురంటూ ఎదురుచూస్తూ ..

కిచ కిచలతో అలరించే చిన్నిపిట్టలు ..

ఇక చరిత్రలోమిగిలిపోయే  చిత్రాలు ..విజయ గోలి .

పగిలిన అద్దంలో  ప్రతిబింబంలా

ఎదుట నిలిచిన గజిబిజి ..ఊహలు ….

ఉప్పెనలా  గట్లు తెంచుకుంటుంటే ..

మహోదయానికి ..మహోజ్వల మార్గం నిర్దేశిస్తూ

ఆశయాల  ఆచరణలకు ..అంకురార్పణ చేస్తూ ..

అరుణోదయ చైతన్య కిరణాలనుఆస్వాదిస్తూ ..

నిర్జీవమవుతున్న ..స్వేచ్ఛకు..ప్రాణం పోస్తూ..

చీకటి పంజరాన్ని  చీల్చుకుంటూ ..

వినీలాకాశపు మరో ప్రపంచంలోకి మరోప్రయాణం ..విజయ గోలి .

మనసు దాగిన మాట..

భావ ప్రకరణ పేర

బాణమై దూసుకొస్తే నోట

వూరి బాటను ఉలిపికట్ట .విజయ గోలి

నక్షత్రాలతో     పోటీ పడుతున్న

నిశీధి నిండిన  మిణుగురులు

నిరంతరం నిజాన్ని  ఓడించాలనే

అసత్యాల అధర్మ  సంగ్రామం ..

తామరాకుపై  నీహారిక  నృత్యానికి

తొలికిరణపు  స్పర్శల  సన్మానం ..

మరుగున పడుతున్న బాంధవ్యాలకు

మమతల వంతెన అనివార్యం ..

.

వేసవి చేసిన గాయాలకు

తొలకరి జల్లుల లేపనమే (ప్రకృతి )చికిత్స ….విజయ గోలి

చెదిరిన స్వప్నాలతో  చెలిమి

కన్నీరై  మిగిలిన కలిమి ..

ఆది

ప్రాణం

అంతం

సూన్యం

కోలాహలం

హలం

హాలాహలం

ఫలం

గిరి

సిరి

ఇర

గాయత్రీ

ఆదిత్యుని తొలికిరణాలతో

అవనికి హారతి పడుతూ ..

అందమైన ఉషోదయం ..

       అందరికి శుభోదయం ..

ఊహల ఉయ్యాల లో ఊగుతున్న కోరికలు సీతాకోకలు

అంధకారంలో ఎగురుతున్న మిణుగురుల మెరుపులు  ..విజయ గోలి

అవనికి అతిధిగా మాత్రమే వచ్చావు

అత్యాశతో. ..అంతా..నాదేనంటున్నావు ..

తరాల కోసం తపన పడుతున్నావు ..

ఎన్ని తరాలైనాఅంతరించక ..తప్పదని

చెప్పకనే  చెపుతున్న  చరిత్ర చూడు…. విజయ గోలి .

గగనమంతా సింధూరం అద్దుకుని

ఆదిత్యుని తొలికిరణాలతో

అవనికి హారతి పడుతూ ..

అందమైన ఉషోదయం ..

       అందరికి శుభోదయం ..

అన్నదాతల

స్వేదం తో సేద్యం ..

గద్దెనేలే  గ్రద్దలకు ..

దోచుకున్న రాబందుల నైవేద్యం .

మక్కువతో పెంచాము మా ఇంటి లక్ష్మిని

మనసార మీకు అప్పగించేము..

తప్పొప్పులెంచొద్దుతను చిన్నపిల్ల ..

మారాడగా తెలియదు ..మర్మమే లేదు

అన్నదమ్ముల మధ్య మెప్పుగా పెరిగింది ..

బంధాల విలువ బహు బాగ తెలియు..

పెద్దలంటే భక్తి ..పిన్నలంటే ప్రేమ. …

సంశయమే లేదు సరి ఐన జోడి..

మీ ఇంటి బిడ్డగా ఆదరించండి…..అంటూ..

మెట్టినింటికి బిడ్డను అప్పచెప్పే వేళ..

అమ్మనాన్నల గుండెలవిసి పోయెను ..

అన్నదమ్ముల మోము కళ దప్పి పోయేను..

ఆడ పిల్లవేనీవంటూ..

అతిధివే ఈడ నీవంటూ….

అక్కున చేర్చుకుని అల్లాడు తండ్రికి ..

గుండెనిండిన బాధ గొంతు దాటిరాక

ఎదపైన తలవాల్చి  వెక్కిళ్ళతో ..

ఏనాటికినేను నీ బిడ్డనే నాన్న

ఏడవకు ..నీవంటూ  కన్నుల కన్నీరు దాచుకుని..

భర్తతో వెడలేటి  బంగారు తల్లిని

గుండె నిండుగా దీవిస్తూ

కదిలి పోతున్న బిడ్డను ..వదలలేక

పొగిలి ఏడ్చే తల్లికడుపు బాధ..

*ఆడపిల్లల అప్పగింత

తల్లితండ్రుల ..అనుభవంలో

అర్ధం కాని ఆనందం..మధురమైన ఒక బాధ..

                        😢విజయ గోలి

రాజ్యమేలుతున్న

రాబందుల కేమితెలుసు

కర్షకుడే లేకుంటే ..

కాలమాగి పోతుందని ..vijaya goli

వారసత్వపు బ్రతుకు పోరు

తరాలుగా తడి ఆరని బ్రతుకులే ..

వార్ధక్యపు వరవడిలో

తప్పని పొట్టకూటి తిప్పలు ..

అధునాతన అంగళ్ళతో

కరువైన కొనేవాళ్ళు ..

బ్రతుక నేర్వ తెలియనోళ్లు ..

రేపటి పై లేదు భరోసా .

ఐనా ఆకళ్ళల్లో ..ఆశల ధిలాసా..విజయగోలి .

అమ్మతనం నీదంటూ.. కమ్మగా

బంధాలతో ..వేసారు  సంకెళ్లు.. విజయ గోలి

మనసుకు మరపు చెలిమి కావాలంతే

లేకుంటే బ్రతుకు బండి సాగదుఅది అంతే

కాలంతో  కరగదీయి ..కష్టమైన నష్టాన్ని

మనసారా తలుచుకోమది నిండిన ఇష్టాన్ని ..

మధురమైన జ్ఞాపకాలు మదిని దాటి పోవంతే ..

పదిలమైన పరిమళాలు పరవశింప చేయుఅదిఅంతేవిజయ గోలి

జ్వలిత నేత్రం ..

రుధిరం స్రవిస్తోంది

మంద్రమైన ..

మలయ పవనాలను ..

చండ్రనిప్పులు చెరగమంటూ..

నిదురిస్తున్న జగతిని ..

జాగృతం చేస్తూ ..

ఉత్తేజపరుస్తూవిజయ గోలి

అహంకారం

ఆక్రోశం

ఆవేశం

ఆనందం

మనుగడ తెలిపే

మహా నైజాలు..విజయ గోలి .

రాధామాధవ దివ్య ఆరాధన ..

కైవల్యానికి కమనీయ  భావన..

ప్రేమకు రమణీయ ప్రేరణ ..

పరాశక్తి పరమేశ్వరి ఆది స్ఫూర్తి ..

వారసత్వపు బాటలో సత్యభామ ..సదా..స్ఫూర్తి..

ముదితల్  నేర్వగరాని విద్య కలదే

ముద్దార నేర్పింపగాన్ …..

నిజంపైకొన్నాళ్ళు ..నీళ్లు చల్లారు ..

నివురు కప్పిన నిప్పులా ..

నిజం రాజుకుంటుంది ..

మాతృస్వామ్యం  మళ్ళి వస్తూంది..

వరకట్నం నెత్తిమీద ..

కన్యాశుల్కం కదం మొదలు..

అమ్మలు ,అమ్మాయిలు సైకిళ్ళు

అమ్మమ్మలు బైకులు

ఇదేమి కొత్తకాదు మాకు

చరిత్రలో ఇంతకు మించిన సాహసాలే..మావి..

అణచివేత నుండి మళ్ళీ అంకురిస్తోందిఅంతే..

చైతన్యం దిశగా చరణాలు కదుపుతోందివిజయ గోలి

మనసును మధిస్తున్న ..

స్పందనలన్నీ ..సందిగ్ధం లో..

సామూహికంగా  సమరం చేస్తున్నాయి .

ఆశ..నిరాశల ..పరదాల మధ్య..

నిశీధి నీడలలో తేలియాడే మిణుగురుల గుంపులా ..

జాగృతిలోనే  ఒక సుషుప్తి

తెల్లకాగితం పై ఒలికిన..

నల్ల సిరా మరకలా … …

ఎదుట నిలిచిన జీవితం ..

సిరా మరకని చిత్రంగా  మలచాలని ..

మొక్కవోని తాపత్రయం

కాలం గడిచిపోతుంది

కాగితం నలిగిపోతుంది

చేతగాని ఆక్రోశం కళ్లని తడిమి ..

కన్నీటి వరదల్ని కడలిలో కలిపేస్తుంది

కాగితాన్ని ..కాల్చేయాలని ..

మరకని మంటల్లో  మసి చేయాలనీ

కుంగుబాటుకు ..లొంగిపోయిన మనసు ..

ఆలోచనలపై తిరుగుబాటు చేసిన ఆచరణలు ..

బలహీనతలోని ..బలానికి  ఊపిరి పోస్తూ ..

గడిచిన నిన్నని కప్పేస్తూ 

క్షణమాగని నేటి లో ఎదురీదుతూ ..

కనిపించని రేపు ను కనుల ముందు..చూస్తూ ..

నిరాశ పరదా..వెనుక ఆశను మాత్రమే చూస్తూ..

మిణుగురులో ..మెరుపును చూస్తూ ..

నలిగిన కాగితం పైసిరా మరకని..

చరిత్ర చూడని చిత్రంగా మార్చాలని ..

తరుణి చదువరైతే

తరియించును తరాలన్నీ ..

చదువులమ్మ .. అమ్మైతే..

ఆవరణలో విరబూయును

అందమైన ..వసివాడని

సంస్కారపు ..విరజాజులు ..  విజయ గోలి

దగ్గరచేస్తూనే ..బంధాలను దూరంచేస్తున్న ..

సాంకేతిక సాలెగూడుసంకేతాలకు ..

దాసానుదాసులై ….కుంచించుకు పోతున్న ..

సమాజానికి హస్తభూషణమై అలరారుచున్న ..

అంతస్తుల విలువలు తెలిపే అందమైన చరవాణీలు..

అన్నం లేకున్నా పర్లేదు

చేతిలోన సెల్లు లేక క్షణ గడవదు

రాలిన పూవులు

ఒక జ్ఞాపకమే ..కాని

పరిమళాలు మాత్రం..

పరవశింప చేస్తాయి .

ఆమని అల్లరి ..వనానికొక ..

అందమైన అనుభవం..

మధుర స్మృతులను ..

మననం చేసుకుంటూ ..

వడి వడిగా..వస్తున్న..

గ్రీష్మం లో  ఒదిగి  పోతుంది ..వనం..

మరలి వచ్చే  వసంతానికై..

మౌనంగా  ..ఎదురుచూస్తూ ….విజయ  గోలి

అక్షరాలతో  అందంగా రంగవల్లులేయాలని

అంతులేని  ఆరాటంస్పందనలను ..చుక్కలుగా ..

పెల్లుబికేభావాలతోపెనవేస్తూ  కలపాలని

            విజయ గోలి.

దోసిలి నిండిన  ఊహలు ..

రెక్కలు రాకుండానే ఎగిరిపోతున్నాయి..

మౌనం లో కనిపించేంత సౌమ్యం లేదు ..

అన్యాయం అంటూ తీతువు లా..

గొంతు చించుకుని అరావాలనుకునే

వెతలు నిండిన ..అంతరంగాల కుత్తుకలను..

కర్కశంగా  కత్తి లాగా ఖండిస్తుంది .. విజయ గోలి

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language