కాలం..కనిపించని ..నేస్తం …విజయ గోలి
వెనుకబడిన జ్ఞాపకాలను …
చేతికఱ్ఱగా వూతం చేసుకుని ..
అలసిన పాదాలతో …
అడుగులు వేస్తూ ..
తడబడే మనసుకు …
కడదాకా కలిసివచ్చే ..నేస్తమే ..కాలం ..
సవ్వడి చేయని..సముద్రంలా ..
సాగిపోయే ..కాలం!
కాగిన కష్టాలకు..
మరపు మందు..వ్రాస్తూ ..
సంతోషాలను…సంబరంగా ..
ఎదపొరలలో ..దాచేస్తూ ..
నీ జీవితానికి నిలువెత్తు సాక్ష్యం ..కాలం..
కట్టుబడని బాంధవ్యం ..
అలుపెరగని కర్తవ్యం..
ఏ పిలుపుకు వెనుతిరగని ….స్థైర్యం
నీలో కదలిక ఉన్నంత వరకు ..
పుట్టుకనుండి ..మరణం వరకు ..
నిన్ను వీడని నిజమైన స్నేహం…కాలం…విజయ గోలి .