గౌహతీ పట్టణంబున
మల్లినాధ సూరి కళాపీఠం
కామాఖ్యాదేవి విజయ గోలి
బ్రహమపుత్రా నదీతీరము
నిర్మల నీలాంచల గిరుల నడుమ
సృష్టి జన్మ మూలమైన పరమేశ్వరి
సతీదేవి యోని స్థానము
మూలరూపముగ శక్తి పీఠమై
వెలిసె కామితార్ధ ప్రదాయిని కామాఖ్యగా
పూజింపదగినది జన్మస్థానమని
పుడమిపై తెలిపే కామగిరి తీర్ధాన
కామాఖ్య రూపాన కోరికలు తీర్చగా
తంత్ర పూజల నిలుచు తల్లి భైరవిగా
ఆది దంపతుల కూడికకు
శివుని రంజింప చేయగా
మరులు రేపెడి సుమచరుడు
తపము భంగము చేయ
ముక్కంటి జ్వాలలా భస్మమై
అదృశ్య మూర్తియై రతిని
అలరించిన పురమ.
కధలు కధలుగ కలవు
కమనీయముగ కామాఖ్య చరితలు
కామగిరి ప్రదక్షిణ కామితములు తీర్చు
కోరిచేరిన వారిని కొంగు బంగారమై
కాచి బ్రోచే తల్లి కామాఖ్య మాత