కాగితం పై కలం తో ..పోరాటం …విజయ గోలి
ఎంత ప్రయత్నించినా .. కలం ఓడిపోతూనేవుంది .
ఉద్వేగంతోనో..ఉత్తేజంతోనో ..
ఆర్తితోనో ..ఆవేశంతోనో …
పెల్లుబికే భావాలను ..
కలం లో ..పట్టి …
కాగితంపై ..పెట్టాలనే ఆరాటం …
స్పందన కు సందిగ్ధానికి పోరాటం ..
స్పందించే మనసుంటే..
కాదేది ..కవితకనర్హం ….
మహాకవి …మహోపదేశం …
సమయంతో సమంగా పరుగెత్తే ..
జనస్రవంతిని చూసినపుడు ..
చైతన్యం చెట్టాపట్టాలేసుకుని పరుగెడుతుంటే .
స్పందన మొండికేస్తుంది …
నిస్తబ్ధత నీరసాన్ని కలిగిస్తుంది …
ఆనందం అవధులు దాటినప్పుడు ..
స్పందించే సమయమే ఉండదు …
మధురమైన జ్ఞాపకాలు ..మనసు దాటి పోనే పోవు..
కష్టాలు కన్నీళ్లు ఇష్టంగా వ్రాయలేను …
స్పందించిన సమయాల్లో సాక్ష్యాలను ..సృజియించలేను ….
సాధనలో ..సాధించాలని ..సాహసిస్తున్నా… విజయ గోలి