కవన సకినం విజయ గోలి
ధనస్సువిరిచి రామయ్య సీతవంకచూసేను18
శిరస్సువంచి సీతమ్మ సిగ్గు ముగ్గులేసింది 1 8
మేలిముసుగుమాటుగా ఓరకంటచూసింది18
కనులుకలిపిరామయ్య నవ్వాడుచిలిపిగాను18
పసిడిపూలమాల పదపదమంటూపలికింది18
తడబడుతువరమాలవరుడిమెడలొవేసింది18
సీతమ్మపాపిటసింధూరం రామయ్యసిరులైనది18
తారకలతలంబ్రాలసాగె సీతారాములకళ్యాణం18
చిత్తమెంత చిత్రము చిందులేయు
నాలికెంత పదును గుండెకోయు
మంచిమాటకు ఉందిమనుగడ
మదుపుతెలిసిన మంచిబ్రతుకు
ఆటవిడుపున ఆదమరువకు
అమ్మనాన్నల ఆశాదీపం నీవు
ఆచరించు ఆశయాల ఆదర్శం
అవనిలోనీవు ఆచంద్రతారార్కం
శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల
శ్రీఅమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యం
సప్తవర్ణాల సంగిడి 9/112020
అంశం-: కవన సకినం
నిర్వహణ-శ్రీమతి గీతాశ్రీ గారు
రచన -:విజయ గోలి
రావోయి చందమామ రసరమ్యపు రాగాల
వెన్నెలంతా వేడుకలేలే చెప్పలేని కోరికలే
వేచేను కలువభామ విరపూసి విందుచేయ
సేదతీర వేచినది చంద్రకిరణ ఛాయలందు
జంటలలోన జతగీతం వెన్నెలై పాడినది
సెలయేళ్ళలో చెలరేగి పొదరిళ్ళ పండుగై
పరువాల వాకిళ్ళ రంగవల్లులేయ రావోయి
కవిమనసున తుళ్ళేను కవనముల జల్లు
*విజయ గోలి గారూ*
*వెన్నెలంతా వేడుకలేలే చెప్పలేని కోరికలే*
*వేచేను కలువభామ విరపూసి విందుచేయ*
*సేదతీర వేచినది చంద్రకిరణ ఛాయలందు*
*జంటలలోన జతగీతం వెన్నెలై పాడినది*
*సెలయేళ్ళలో చెలరేగి పొదరిళ్ళ పండుగై*
*పరువాల వాకిళ్ళ రంగవల్లులేయ రావోయి*
మీదైన పదాల ప్రవాహ పరవశ శైలి.కవన సకినంలో ఈ రోజు గీతాశ్రీ గారిచ్చిన శీర్షికకు ప్రభాస మానం చేయించి లాహిరి.లాహిరి అనే విధంగా గోదావరిలో పడవ ప్రయాణం చేయించి వెన్నెల జల్లులలో ముంచేసింది… భావ గాంభీర్యత బాగా కుదిరింది శ్రీ. అమరకుల దృశ్య కవి