రచన-: విజయ గోలి
మన్నేదని అడిగినంత మిన్నుచూపె
కాళిందుని పడగలపై నటనమాడెనే
గోవర్ధనమెత్తి గొడుగువలె కాచినాడె
గోకులములోన గోవిందుడి చిందులే
నవనీతపు నవ్వులలో మాయలాడె
రాధమ్మను వలపులలో ముంచినాడె
మురళిపాటల రాగాలతో జోలపాడె
నల్లనయ్య నవ్వులెపుడూ మువ్వలే