కవన సకినం..మల్లినాధ సూరి
విజయ గోలి
ఆర్తుల పాలిటి అమ్మగా. ..ధూర్తుల పాలిటి దుర్గగా..
సహనాన ధరణిగా..ప్రజ్వరిల్లు దీపానికి ప్రతీకగా..
ముగ్గురమ్మల కలిపి మురిపెంగ మలిచాడు ..ఆడబొమ్మను.
బ్రహ్మ చేసిన బొమ్మంటూ ..అపహాస్యపు నవ్వులపై అలవోకగనెగ్గి
సంకుచితపు సంకెళ్ళు త్రుంచి..స్వాతంత్ర్యపు శంఖునూది..
సహగమనపు చితులనార్పి ..సాధికారత నందుకున్న …
స్త్రీ జాతికి …పరాశక్తి ..పరమేశ్వరి ..ఆది స్ఫూర్తి ..
వారసత్వపు బాటలో ..సత్యభామ ..సదా..స్ఫూర్తి..🙏🏻🙏🏻