శ్రీ మల్లినాధసూరి కళాపీఠం. ఏడుపాయల
సప్తవర్ణాల సింగిడి 24/8/2020
అంశం-:కవన సకినం
మహోత్కృష్టమైనది మానవ జన్మ
నిర్వహణ-: శ్రీమతి గీతాశ్రీ స్వర్గం
రచన-:విజయ గోలి
అత్యుత్తమం మనిషిజన్మ
విచక్షణే మనుజ జన్మ
పరమహంసల ప్రగతి
పరిచయించ పరిఢవిల్లు
అల్పమైనది అధోగతిని పడక
తామసాదు లొదిలేసి తాపసిగ
మానవత్వం మార్గమై తరియించు
మహిమాన్విత మానవజన్మ