కవనంగా మలుచుకోను

గజల్. విజయ గోలి

కవనంగా మలుచుకోను  అక్షరాలె వెతుకుతున్నా
సమరంలో  ఆడుకోను  బాణాలే వెతుకుతున్నా

సంబరాన కలసిపోను సంపదలే ఉరకలేయు..
వేదనలో నిలిచిపోవు బంధాలే వెతుకుతున్నా

చిగురాకులు రాలుతుంటె చిన్నపోద వృక్షమే
వేరుసోకిన రోగానికి  మూలాలే వెతుకుతున్నా

వడపోతల కాలానికి కాలుడినే పిలుస్తున్నా
కామంతో కాలుదువ్వు జీవాలనె వెతుకుతున్నా

ఆదిశక్తి ఆవహిస్తే అతివలదే “విజయ”ములే
శిధిలమైన దుర్గాలలో దీపాలనె వెతుకుతున్నా

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language