శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్ విజయ గోలి
కోరుకున్న కలలమేడ శిధిలాలుగ మారుతుంది
కన్నీటిలో ఎదురీతలు కలవరముగ మారుతుంది
అమావాస పున్నములే అలుపెరుగక నడిచిననూ
ఆశలతో ఎదురుచూపు అలవాటుగ మారుతుంది
కనుపాపలు కొడిగట్టిన వెలుగులుగా నిలిచిననూ
ప్రేమఎపుడు ఓడిపోని చరితాలుగ మారుతుంది
వసంతాలు మోసుకొచ్చు నీఊసుల పరిమళాలు
చిగురించే చిరుఆశలు హరితాలుగ మారుతుంది
ఆరాధన అర్చనైతె అందలేని విజయమేది
వమ్ముకాని నమ్మకమే దైవాలుగ మారుతుంది