1)కాలమైతే కరిగిపోతుంది.!
మైమరిపించే మోహనరాగం వీనులవిందు చేయకనే10/9/2017
కలలో కూడా వీడని .
కలతల సాన్నిధ్యం …
నిదుర చెదిరిన కన్నులకు
కడలితో బాంధవ్యం .
వేసవి గాయాలకు ..
తొలకరి జల్లుల లేపనం ..
చిగురు తొడుగులు ..
చూసినప్పుడే ..
మ్రోడైన మానుకు ..
చిరు సాంత్వనం ..విజయ గోలి .
2)ఆమని రాగాలు ఆలపిస్తూ కొమ్మ మాటున కోయిలమ్మ!
మత్తుగొలిపే మధురోహల ఊయలూగుతూ మావికొమ్మన ముద్దబంతి పూలరెమ్మ !17/09/2017
3)కలల ఊసులు విన్నాయేమో కళ్ళు!
చూపుల సన్నాయి ఆలపిస్తూనే వున్నాయి! !19/09/2017
1)కరుగుచున్నది కాలము కలల అలలపై !
వెతుకుచున్నవి కనులు దరిచేర్చు రహదారికై !17/09/2017