శుభోదయం🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
కలత పడిన ప్రతిసారీ కలం కదిలి పోతుంది
కావ్యంగా కాలంతో కలిసి మెలిసి పోతుంది
వేగు చుక్క వెలుగైనా ఆశకొక్క ఆసరా
పగటి వెలుగు నీడెపుడూ వడిగ తరిగి పోతుంది
బ్రతుకెపుడూ బండరాయి… ఉలిదెబ్బలె ఉనికి గా
ఆటుపోటు అలల దారి పడవ జరిగి పోతుంది
మెట్టు మెట్టు ఎక్కేవులె చందమామ చుట్టమై
పాలపుంత సొంతమంటె పరువు తరిగి పోతుంది
నిన్న నీవె నేడు నీవె రేపు నీవు నీవైతే
అద్రి వంటి నీ విజయం పృధ్వి నిలిచి పోతుంది!!