కలత నిదురలో….విజయ గోలి
కలత నిదురలో కలలు కంటున్నా ..
కన్నీటి కడలిపై వారధి కడుతున్నా…
పదిలమైన స్మృతులను అడుగడుగునా అమరుస్తూ ..
మౌనం వెనుక మాటలను …నీ బాట నింపుతున్నా…
నిశీధి దాగిన వెలుగు కోసం …వేచి చూస్తున్నా…
కనుచూపు మేరలో ….కనిపించని గమ్యం..
ఎదురుచూపుల కాలం …..నిండు వేసవిలో ..
ఎండమావిలా ఎదుట నిలుస్తుంది…