*కాగితం పై కలం పోరు* విజయ గోలి
ఆచరణకు నోచలేని ఆశయాలు ..
మాటలోనే తొంగి చూచు ఆదర్శం ..
చేతలలో చేరువవని చైతన్యం ..
నోటి మాట చేరుతోంది నీటిపైన రాత లాగ..
మనిషి లోని మనిషికి రంగేసి
మనసు లోని మనసును దాచేసి
నల్ల కళ్ళజోడు వెనుక కుళ్ళు చూపు దాచేసి.
పెదవి పైన మధువు పూసి మాటాడే
నైజంతో …నైతికతను దిగజార్చే …
మేకవన్నె పులుల ..చూసినపుడు ..
ఆవేశమో …ఆవేదనో ..తెలియని ..
నా భావాలను ..వెలికి తీసే ..ఆరాటం లో ..
కాగితం పై కలం చేసే పోరాటం ..