కర్మ భూమిలో కమనీయ దృశ్యాలు విజయ గోలి
అంతం లేని అంతస్తుల అభిజాత్యాలు ..
భయం తోటి సమర్పించు భక్తి నీరాజనాలు ..
పాపాలకు… పరిహారం పాలాభిషేకాలు ..
పాలకోసం రోదించే పాపాయిల గొంతులు ..
చెవినపడవు ..ఏనాటికి ..తడి ఆరిన తపనలు ..
స్వార్ధంతో స్వర్గద్వారం తెరిపించగ ..పూజలు ..
మంచి మార్గమెంచి చూపిన మహా యోగికి ..
వజ్రాలకిరీటాలు ..బంగారు తాపడాలు..
కోరికల చిట్టాలకు..కొలమానం ..బహుమతులు ..
అందించిన సందేశం అందుకునే ఇచ్ఛలేదు ..
మూలవిరాట్ సాక్షి గా …కీలక వ్యాపకాలు .
లాభసాటి వ్యాపారంగా దేవ దేవుని నిలయాలు ..