గజల్ విజయ గోలి
కరిమబ్బుల ఉరుములలో కఠినతనం ఉన్నదిలే
జడివానలొ జారిపోవు జాణతనం ఉన్నదిలే
నిట్టూర్పుల వేడిశెగలు నింగినెపుడు తాకవు
చిరుజల్లుల స్పర్శలలొ చల్లదనం ఉన్నదిలే
ఎడారిలో వసంతం ఎండమావి వర్ణములె
రాగాలలొ పల్లవించు పచ్చదనం ఉన్నదిలే
కదులుతున్న కాలంపై కసిఎందుకు చూపేవు
చెలిమితోను చెంతచేరు సరళ తనం ఉన్నదిలే
భయపడితే వెంటాడే లోకమనే వెరుపున్నది
విజయమనే విచ్చుకత్తి ధీరతనం ఉన్నదిలే