విజయ గోలి
కదిలే ఒక చరిత్ర కాలగమనంలో కలిసిపోయింది
మరలి రాని లోకాలకు మరలిపోయింది.
పాత జ్ఞ్హాపకం లా మరిచిపోలేని బంధం
మధుర స్వప్నం లా మనసు నిండిన అనుబంధం
తోడబుట్టిన ఋణం తీరలేదనే తపన ..
జన్మనిచ్చిన ఋణం పెంచుకున్నననే బాధ
ప్రేమ పంచిన వారితో పంచుకోలేడనే వ్యధ
ప్రతిమాటలో ప్రతిక్షణం పశ్చాతాపం నిండిన మనసు
అపరాధ భావం తో క్రుంగిపోయింది
అనుభవించింది అన్ని ఇక్కడే
పరితపించిన మనసులో యోగత్వం పరిణితి చెంది
దివ్యత్వం నింపుకుంది …మింటికేగిసిన ఆ తేజం…
దేవుని ఇంటి ముంగిట దీపమయి నిలిచింది . Vijaya goli
#Telugu Pride