శుభోదయం🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
కదలనీక కాలాన్నే ఆపవోయి ప్రియతమా
చలి పండుగ నీతోడుగ నిలుపవోయి ప్రియతమా
తరిగి పోవు వెన్నెలనే జత చేసుకు తరలి రాకు
చెయివీడని చెలిమల్లే చేరవోయి ప్రియతమా
రాక తెలుపు లేఖలలో విజయగీతి సంబరాలు
మోసుకొచ్చు పరిమళాలు పంచవోయి ప్రియతమా
మంత్రించే నీ చూపులు మల్లెపూల మాలలేగ
మౌనానికి వీడుకోలు మరువకోయి ప్రియతమా
మది లోపల అగరు సెగల నెగడేదో రగులుతుంది
మంచు పూల దుప్పటేదొ కప్పవోయి ప్రియతమా !!