కట్టుబాటు లేనిదేగ కాలం

విజయ గోలి. గజల్

కట్టుబాటు లేనిదేగ కాలమంటె లోకంలో
గిట్టుబాటు కానిదేగ మనుగడంటె లోకంలో

కుర్చీలపై ఆశలతో కులమతాల గోడలేగ
రాజకీయ చదరంగం ఆటలంటె లోకంలో

కానిపనులు కాజేసే కాలమెంత బలమైనదొ
కర్మలతో కలిపికట్టె నడతలంటె లోకంలో

ఎదురుపడని అదృష్టం ఎందరిదో తలరాతలో
బ్రతుకెందుకు ఒక్కమనసు గెలవకుంటె లోకంలో

ఎగిరిపడకు గాలివాటు జీవితాల గమనంలో
నిలకడైన చేతలదే  “విజయ”మంటె లోకంలో

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language