ఓహో శిల్పీ … విజయ గోలి
కఠిన శిలకు వూహతోటి ..ఉలిని చేర్చి …ఉనికినిచ్చావో..
దివి నుండి భువికి దిగిన …దేవకన్యలే ..ప్రేరణయ్యారో ..
అప్సరసల అందమంతా …అరువు ఇచ్చారో ..
అణువు అణువున ..అందమద్ది మలిగిపోని జీవమిచ్చావు …
తపస్సంతా ..ధారపోసిన ..మౌనిమల్లే …
మనసుకే రూపమిచ్చి ..వెలుగు నింపావు ..
బ్రహ్మ దేవుని కంటికే ..ఈసు ..పుట్టిందేమో ..
కరుడు కట్టిన కాఠిన్యం కత్తులే దూసింది ..
కరిగిపోయిన కాలంలో ..మిగిలిపోయిన ..ఆనవాలై నిలిచింది ..
అవనిపై ..అందము . …అలరారునంతవరకు ..
నీ సృజన.. ఈ సృష్టికే నీరాజనమై నిలుచు ..