ఎర్ర జెండా మే డే

గజల్         విజయ గోలి

ఎవరికొరకొ  ఎదురుచూపు  చూడనేల శ్రామికుడా
మొదటిఅడుగు ఒంటరిదే ఆగుటేల శ్రామికుడా

జమానాలు మారిపోయె జాగీరులు జారిపోయె
నీ స్వేదపు రంగు రుచులు మారవేల శ్రామికుడా

ఉద్యమాల నినాదాల ఊగిసాగి ఊరేగిన
అడుగడుగున  అణచివేత ఆగదేల శ్రామికుడా

అణువణువున  నీవులేక  అభ్యుదయం అడుగులేదు
ప్రగతిపధం  నీ జెండా  ఎగరదేల  శ్రామికుడా

గద్దెలెక్కి గ్రద్దలైన పెద్దలదే జులుమంతా
శ్రమదోపిడి  విధానాలు వదలరేల శ్రామికుడా

శ్రమజీవన సౌందర్యం  మాటలలో మసకబారె
కార్మికుడి   కడగళ్ళకు కంచెలేల శ్రామికుడా

విశ్వమందు విత్తుకూడ మొలవలేదు నీవులేక
ఎర్రజెండా  ఎగరకుండా  విజయమెలా శ్రామికుడా

About the author

Vijaya Goli

Add Comment

Language