ఎపుడొస్తున్నావు ..విజయ గోలి
యధా యధాహి ధర్మస్త్య గ్లానిర్భవతి పార్ధా!
ధర్మ సంస్తాపనార్ధాయ సంభవామి యుగే ,యుగే
ధర్మాన్ని కాలిక్రింద త్రొక్కిపెట్టి
అధర్మం అట్టహాసంగా పట్టాభిషేకం చేసుకుంది
కరుడు కట్టిన కసాయితనం
అధర్మానికి అండగా వికటాట్టహాసం చేస్తుంది
ధర్మానికి కష్టం కలిగినపుడు వస్తానని చెప్పావు
ఎపుడు వస్తున్నావు తండ్రీ!
మానవత్వపు జ్యోతి మసిబారిపాయింది
నీతి నియమాల కొలత కూలి పోయింది
ఒంటి పాదంతో ధర్మం కుంటు బడిపోయింది
స్వార్ధమనే సునామి ప్రపంచాన్ని సుళ్ళు త్రిప్పుతోంది
కత్తి పట్టి క్రొత్తావతారమ్ తో కనికరిస్తానన్నావు
ఎపుడు వస్తున్నావు తండ్రీ
ఎపుడో వస్తావని ఎదో చేస్తావని ఎదురు చూసే
పిచ్చి జనానికి రోజుకొక బాబా నీ అవతారంగా పుట్టుకొస్తున్నారు .
ఎక్కడున్నావు తండ్రీ..
అంతరిక్షం లో అంతఃపురాల నిర్మాణం పై ఆలోచించే
మేధావుల నిన్ను మించే ప్రయత్నాలు
నాగరికత గోడలపై నిలిచిన ఆధునికత
పెడత్రోవలు పడుతుంది ,ఎక్కడున్నావు తండ్రీ
వేగిరం వచ్చి అధర్మం పై కదం త్రోక్కించు
కసాయితనం పై కత్తి ఝుళిపించు.
ఎక్కడున్నావు తండ్రీ ఎపుడు వస్తున్నావు! Vijaya goli