ఎదను ముల్లు

శుభోదయం 🌹🌹🌹🌹🌹

గజల్ విజయ గోలి

ఎదను ముల్లు గుచ్చిననూ నవ్వులన్ని నీకొరకే
వలపు జతలొ కలిపికట్టు పువ్వులన్ని నీకొరకే

కనిపించని దారులలో కాలమాగి చూస్తున్నది
కొడిగట్టే కొవ్వొత్తుల వెలుగులన్ని నీకొరకే

పొడి బారిన పాదులపై చిరుజల్లుల చిలకరింపు
పలకరింపు ఆశలతో పాటలన్ని నీ కొరకే

చుట్టు చుట్టు ఎందరున్న మనసు తాకని మంటలే
వెత నింపుకు వెతుకుతున్న చూపులన్ని నీకొరకే

వివరమేదొ తెలియకనే విజయమెలా చెప్పగలను ?
ఊహలలో ఊగుతున్న ఊసులన్ని నీ కొరకే !

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language