ఎక్కడున్నావు తండ్రీ

*ఎక్కడున్నావు తండ్రీ…*

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం…

ధర్మ సంస్తాపనార్ధాయ సంభవామి యుగే ,యుగే

ధర్మాన్ని కాలిక్రింద త్రొక్కిపెట్టి

అధర్మం అట్టహాసంగా పట్టాభిషేకం చేసుకుంది

కరుడు కట్టిన కసాయితనం

అధర్మానికి  అండగా వికటాట్టహాసం చేస్తుంది

ధర్మానికి  కష్టం కలిగినపుడు వస్తానని చెప్పావు …

మానవత్వపు జ్యోతి  మసిబారిపాయింది

నీతి నియమాల కొలత కూలి పోయింది

ఒంటి పాదంతో ధర్మం కుంటు బడిపోయింది

స్వార్ధమనే త్సునామి  ప్రపంచాన్ని సుళ్ళు త్రిప్పుతోంది

కత్తి పట్టి  క్రొత్తావతారము తో కనికరిస్తానన్నావు

ఎపుడో వస్తావని  ఎదో చేస్తావని

ఎదురు చూసే జనానికి ..

రోజుకొక  బాబా …అహంబ్రహ్మస్మి ..

అంటూ అవతరిస్తున్నారు..

నువ్వున్నావని నమ్మకం ..

సన్నగిల్లే లోపు ..సంరక్షించు తండ్రీ…

అంతరిక్షం లో  అంతఃపురాల నిర్మాణం పై ఆలోచించే …

మేధావుల నిన్ను మించే ప్రయత్నాలు …

నాగరికత  గోడలపై నిలిచిన ఆధునికత …

పెడత్రోవలు పడుతుంది ,ఎక్కడున్నావు తండ్రీ

వేగిరం వచ్చి  అధర్మం పై  కదం త్రోక్కించు

కసాయితనం పై కత్తి.. ఝుళిపించు…

ఎక్కడున్నావు తండ్రీ….

ఎక్కడున్నావు తండ్రీ ……………………విజయ గోలి

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language