శ్రీమల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల
శ్రీఅమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యం
సప్తవర్ణాల సింగిడి 1/12/20
అంశం-: కార్తీక మహోత్సవం
నిర్వహణ-:కవివర్యులు శ్రీ బి వెంకట కవి గారు
శ్రీమతి సంధ్యా రెడ్డిగారు
రచన-: విజయ గోలి
ప్రక్రియ -వచన కవిత
అష్టాదశ శక్తి పీఠాలలో …నవమ శక్తి పీఠం
ఉజ్జయన్యాం మహాకాళీ
క్షిప్రానదీ తీరాన
సప్తపురములో ప్రఖ్యాతి గాంచిన
ఉజ్జయిని నగరమున
సతీదేవి మోచెయ్యి పడిన
ప్రదేశమున మహాకాళీ మాతగా
భక్తుల పాలిటి జగజ్జననియై ..
కరుణించు శాంభవిగ..
చండముండాసురలను
సంహరించుటకై ..అంబిక
అంశగా కాళిక కాటుకరంగుతో
ఎర్రని కళ్ళతో వ్రేలాడు నాలుకతో
నిడువైన విరబోసిన జుట్టు
గజచర్మధారియై కపాలమాల ధరించి
అష్టభుజములతో ఖడ్గ ,
పాశ ఆయుధాలతో ..ఉద్భవించిన
మహాశక్తిగ …దేవీ భాగవత ఉద్ఘాటన.
తృతీయ జ్యోతిర్లింగముగా
ఆది దేవుడు మహా కాళేశ్వరుడై
చితాభస్మాభిషేకుడై..శివత్వమును
పరిపూర్ణ యోగత్వమును
పంచు పరమ శివుడు
రామకృష్ణ పరమహంసకు
జగన్మాతగ ..దివ్య దర్శనమిచ్చినతల్లి
మహాకవి కాళిదాసుకు
విద్యా వరములిచ్చి కాచిన కాళికమ్మ
తెల్లని హంసతో పోల్చి
అర్చించు ఉజ్జయిని జనులన్న
అమ్మకు అత్యంత ప్రీతి..
కష్టముల కాచు కాళికమ్మ
అడిగినంతనే వరములిచ్చు జగదంబ
అనన్నింట తానైన ఆదిశక్తి
సృష్టి స్థితి లయల సూచించు పరాశక్తి
కొలిచినంతనే కోరికలు తీర్చేటి పరమాత్మిక