గజల్ విజయ గోలి
ఇసుకమీద రాతలన్ని అలలుచెరిపి వేస్తాయి
కోరుతున్న బంధాలను కలలుచెరిపి వేస్తాయి
జ్ఞాపకాలు కనులనీడ కలవరాన నిలిచాయి
ఆకశాన తారలుగా తలపుచెరిపి వేస్తాయి
జతనడిచిన దారులపై చీకటులే ముసిరాయి
వెతుకులాడు చూపులలో వెలుగుచెరిపి వేస్తాయి
వలపుతోట గురుతుంటే బాటచివర నేనుంటా
కలిసిరాగ ప్రేమదారి హద్దుచెరిపి వేస్తాయి
మంటకలుపు మనసులోని కలుపుపంట
విజయంగా అడ్డదారి మలుపు చెరిపి వేస్తాయి