శుభోదయం 🌹🌹🌹🌹🌹
*ఆ పాత మధురం *. విజయ గోలి
గుత్తులు గా గులాబీలు
హత్తుకున్న ఆనందం
మది చుట్టిన ముళ్ళ కంచె
దారివ్వని దగాతనం
మానని తీపి గాయంగా
జ్ఞాపకాల గేయం
పదే పదే పాడుతున్న
ఆపాత మధురం
అలాగే వుంది .
ఎందుకిలా. ..
నీకూ నాకూ మధ్య
ఎవరు సృష్టించారు
ఈ నిలువెత్తు నిశ్శబ్ధాన్ని
గుండె గుడి గంటతో
ఛేదిస్తున్నా
మళ్ళీ నువ్వూ నేను
అపరిచితులు గానే
పరిచయమవుదాం
ప్రేమ దారి నడిచేద్దాం
కాలం కరకు దారైనా
తన పని తను
చేసుకు పోతూనే వుంది గా..
మనసుకు సంకెలలు వేసుకు
మనమే ఎందుకిలా..
మౌనాన్ని తరిమేస్తున్నా
మరణించే వరకు …
మన దాపుల రావద్దని
ఆది కావ్యం ఆరంభిస్తున్నా
శాంతి కపోతం రెక్కల పై
నువ్వు నేను చేతిలో చెయ్యేసుకు
గమ్యం లేని గగనపు దారుల
గమనం సాగిద్దాం…..
మళ్ళీ అపరిచితులుగా
మన పయనం సాగిద్దాం ..