మల్లి నాధ సూరి కళాపీఠం. విజయ గోలి
అలజడి రేపుతున్న
ఆన్ లైన్ క్లాసులు..
అమ్మానాన్నల గుండెల్లో
మ్రోగుతున్న టపాసులు
కంప్యూటర్లకే అంకితమవుతూ
కన్ఫ్యూజన్లో భావిపౌరులు..
కె జి నుండి పి జి వరకు
ఓపెన్ బుక్ ఆఫర్లు..
పరీక్ష లేని ఉత్తీర్ణతలే ఉద్యమం
విద్యలోన ధనికపేద వర్గాలను
విడదీస్తూ విస్తరిస్తు ప్రభుత్వం
వున్నవారి పిల్లలలొ ఉత్సాహం
లేనివారి పిల్లలలొ కరువైన ప్రోత్సాహం
కరోనా తో కాలుతున్న విశ్వం
ఎటుపోతుందో అర్ధం కాని వైనం…..
క్రొత్తొక వింత పాతొక రోతను…
సామెత మార్చి….సమూలంగ
పాతకు కొంగ్రొత్తను చేర్చి..
వనంలోన గురుకులాలు..
ఉద్భవిస్తే ..ఉన్నతం…