ఆనంద సోపానం* 🌹🌹🌹🌹విజయ గోలి
కనుల లోన కదలాడిన ..
అపరాజిత కలలన్నీ..
అందలాలు ఎక్కినపుడే
అందరికీ ఆనందం..
ఏడడుగుల నడకలో
తడబాటులు లేకుంటే
గంగ ఓలె నిండుగ
సాగిపోతె ఆనందం
మనిషికొక్క తీరుగా
మనసు నుండు..ఆనందం
తెలుసుకుని నడుచుకుంటె
మనుగడంత ఆనందం
సానుకూల తత్వమే
సహజీవనమైతే…
సుమగంధపు పరిమళాల
వెల్లివిరియు ఆనందం
ఇహము లోన అహము..
మరిచి..అడుగులేస్తే
మది నిండుగ మాధవుని
నింపుకుంటే ..జీవనమే ..
ఆనందపు కైవల్యం.. ..