ఆత్మీయ నేస్తం

మిత్రులకు ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు 🌹🌹🌹🌹🌹

23/4/2021

*ఆత్మీయ నేస్తం విజయ గోలి

పుస్తకమంటే వాగ్దేవీ
కరదీపిక అలరారు ఆభూషణమే
అజ్ఞాన తిమిరాన్ని పారదోలే
అభ్యుదయ మార్గాన
వెలుగు రేఖలు పంచు
అఖండ విజ్ఞాన జ్యోతులు

పెద్దలు వ్రాసిన పుస్తకాలే కద
మనకు బుద్దులు నెరిపినవి
ఆదర్శమై ఆదరణ చూపినవి
బ్రతుకు దారిన భావి చూపినవి

మనసు చెమరించిన వేళ
అమ్మలా చేరదీసేది
ఆత్మ పరిశోధన చేసి
ఆర్తి పంచుకు ఆదరించే
ఆత్మీయ నేస్తం పుస్తకం

ఏవేళనైనా ఎడబాయక
తోడై నీడలా నిన్నల్లుకునే
నిస్వార్ధ స్థైర్యం ..పుస్తకం..
నిదుర రాని వేళ నీకన్నుల లాలిగా
నీఎదను జోలగా లాలించేది
మనసైన మంచి పుస్తకం

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language