గజల్. విజయ గోలి
పిచ్చిప్రేమ అంటారె పిచ్చేమిటొ అవగతమే
ఆఇరువురి బంధంలొ ఇరుసేమిటొ అవగతమే
అవని తల్లి అలజడేమొ మేఘాలకు విదితమేగ
ఎడబాసిన మనసులలో మమతేమిటొ అవగతమే
జాలిపడే లోకానికి కనులనీరు కనపడినా
మేలిమైన ముత్యాలుగ విలువేమిటొ అవగతమే
ప్రేమంటే పిచ్చికాదు మందాకిని సంగమమే
మౌనమేలు బాటలలో మలుపేమిటొ అవగతమే
అంతులేని ప్రేమలలో ఆరాధనె విజయములే
ఒక మీరా మధురమైన భక్తేమిటొ అవగతమే