గజల్. విజయ గోలి
అలసిన కాలం ఆగెను నేడు వెతలకు వెరవకు నేస్తం
కలతలు దాటుతు కలలను నేద్దాం నిదురన చెదరకు నేస్తం
ఎడద కడలిని మోయాలంటే కన్నుల సాయం కావాలి
నిన్నటి వెతలవి … నీడల దాగే…వెనుకకు పిలువకు నేస్తం
గాయపు మచ్చలు చెరిపిన చెరగవు చెమ్మలె మిగులును
చెలిమికి చేసిన బాసల విజయం…బరువని బెదరకు నేస్తం
అలకలు తీర్చగ కొసరిన కోయిల చిటారు కొమ్మన కూసే
వెలుతురు ఓర్వని వేడుక దారుల వడిగా నడవకు నేస్తం
రేపటి దారులు రేయీ పగలే ఎదుటే పడవని చెప్పకు
చీకటి నుండే వేకువ బాటలు …ధైర్యం విడువకు నేస్తం