శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
అలిసితివొ సంగమాన సంద్రమా ఆగలేవ
పరుగేల కలువచూడ చంద్రమా ఆగలేవ
ఉదయమే ఉరిమితేను ఊసేమి మిగిలేనులె
తేనీటి విందుచేతు సూర్యమా ఆగలేవ
కాలం కు కళ్ళెమేసి వినువీధి విహరిద్దాం
మబ్బులనె మరలించీ పవనమా ఆగలేవ
అలకెపుడు తొలకరులే కొరతలో కోరికలే
ఆశెపుడు అందలమే ప్రియతమా ఆగలేవ
విరి మాల లొ దారమే బంధమై గంధంగా
నీ తోడు “విజయమంటె నేస్తమా ఆగలేవ!!